Gmail ప్రోగ్రామ్ పాలసీలు

కింది ప్రోగ్రామ్ పాలసీలు Gmailకి వర్తిస్తాయి. Gmailను ఉపయోగించే అందరికీ సానుకూలమైన అనుభవం అందించడంలో ఈ పాలసీలు ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి.

మీరు Gmailని కన్జ్యూమర్ (ఉదా., @gmail.com) ఖాతాతో వినియోగిస్తే, మరింత సమాచారం కోసం Google సర్వీస్ నియమాలు కూడా చూడండి. మీరు కార్యాలయం, పాఠశాల లేదా మరొక సంస్థ ద్వారా ఖాతాను ఉపయోగిస్తుంటే, Google లేదా ఇతర పాలసీలతో మీ సంస్థ ఒప్పందం ప్రకారం నిబంధనలు వర్తించవచ్చు. మీ అడ్మినిస్ట్రేటర్ మరింత సమాచారాన్ని అందించగలరు.

ఈ సేవలను అందించడంలో మా శక్తి సామర్థ్యాలకు ఆటంకం కలిగించే దుర్వినియోగాలను నివారించవలసిన అవసరం ఎంతైనా ఉంది, అందుకోసమే ప్రతి ఒక్కరినీ దిగువ పేర్కొన్న పాలసీలకు కట్టుబడి ఉండి ఈ లక్ష్యాన్ని సాధించడంలో మాకు సహాయపడాలని మేము కోరుతున్నాము. పాలసీ ఉల్లంఘన జరగవచ్చని మాకు నోటిఫికేషన్ అందితే, మేము కంటెంట్‌ను రివ్యూ చేసి, Google ప్రోడక్ట్‌లకు యూజర్ యాక్సెస్‌ను పరిమితం చేయడం లేదా ఉపసంహరించడం వంటి చర్యలు తీసుకుంటాము. మీ ఖాతా డిజేబుల్ అయి ఉండి, అది పొరపాటుగా జరిగిందని మీరు భావిస్తే, దయచేసి ఈ పేజీలో కనిపించే సూచనలను అనుసరించండి.

స్టోరేజ్ కోటా పరిమితులు దాటిన ఖాతాలపై మేము చర్య తీసుకోవచ్చు. ఉదాహరణకు, మీరు మీ స్టోరేజ్ కోటాను దాటిపోతే, మెసేజ్‌లు పంపడం లేదా అందుకోవడంపై మేము నిషేధం విధించవచ్చు. మీ స్టోరేజ్‌ను తగ్గించడంలో లేదా సరిపడే అదనపు స్టోరేజ్‌ను పొందడంలో మీరు విఫలమైతే కూడా మేము మీ ఖాతా నుండి కంటెంట్‌ను తొలగించవచ్చు. స్టోరేజ్ కోటాల గురించి ఇక్కడ మరింత చదవండి.

ఈ పాలసీలు మార్పు చెందే అవకాశం ఉంది, కాబట్టి తరచూ గమనిస్తుండండి.

దుర్వినియోగమని రిపోర్ట్ చేయండి

ఒక ఖాతా మా ప్రోగ్రామ్ పాలసీలను ఉల్లఘించిందని మీరు భావిస్తే, దాని గురించి రిపోర్ట్ చేయడానికి అనేక మార్గాలు ఉన్నాయి:

  • సాధారణ దుర్వినియోగానికి సంబంధించి రిపోర్ట్ చేయడానికి ఈ ఫారమ్‌ను ఉపయోగించండి
  • చిన్నారులను అనైతిక శృంగారానికి లోబరచుకోవడం సంబంధించి రిపోర్ట్ చేయడానికి ఈ ఫారమ్‌ను ఉపయోగించండి
  • కాపీరైట్ ఉల్లంఘనలకు సంబంధించి రిపోర్ట్ చేయడానికి ఈ ఫారమ్‌ను ఉపయోగించండి

దుర్వినియోగ ప్రవర్తనను మేము ఎలా నిర్వచిస్తామో అర్థం చేసుకోవడానికి కింది పాలసీలు తప్పకుండా చదవండి. మా పాలసీలను ఉల్లంఘిస్తున్నాయని గుర్తించిన ఖాతాలను Google డిజేబుల్ చేయవచ్చు. మీ ఖాతా డిజేబుల్ అయి ఉండి, అది పొరపాటుగా జరిగిందని మీరు భావిస్తే, దయచేసి ఈ పేజీలోని సూచనలను అనుసరించండి.

ఖాతా ఇన్‌యాక్టివిటీ

యాక్టివ్‌గా ఉండటానికి ప్రోడక్ట్‌ను ఉపయోగించండి. యాక్టివిటీలో భాగంగా ప్రోడక్ట్ లేదా దాని కంటెంట్‌ను కనీసం 2 ఏళ్లకు ఒకసారైనా యాక్సెస్ చేయాల్సి ఉంటుంది. ఇన్‌యాక్టివ్ ఖాతాలపై మేము చర్య తీసుకోవచ్చు, అందులో భాగంగా ప్రోడక్ట్ నుండి మెసేజ్‌లను తొలగించడం కూడా చేయవచ్చు. ఇక్కడ మరింత చదవండి.

స్పామ్, ఒకేసారి అనేక మెయిల్‌లు పంపడం

స్పామ్‌ను లేదా అవాంఛిత వాణిజ్య మెయిల్‌లను పంపిణీ చేయడానికి Gmailని ఉపయోగించవద్దు.

మీరు CAN-SPAM చట్టాన్ని లేదా ఇతర స్పామ్ నిరోధక చట్టాలను ఉల్లంఘించి ఇమెయిల్ పంపేందుకు; బహిరంగ, థర్డ్-పార్టీ సర్వర్‌ల ద్వారా అనధికారిక ఇమెయిల్ పంపేందుకు; లేదా ఎవరైనా వ్యక్తి ఇమెయిల్ చిరునామాలను వారి సమ్మతి లేకుండా పంపిణీ చేసేందుకు Gmail ఉపయోగించడానికి అనుమతించబడరు.

యూజర్‌లను తప్పుదారి పట్టించే లేదా మోసగించే క్రమంలో ఇమెయిల్‌లు పంపడానికి, తొలగించడానికి లేదా ఫిల్టర్ చేయడానికి మీరు Gmail ఇంటర్‌ఫేస్‌ను ఆటోమేటిక్ చేయడానికి అనుమతించబడరు.

మీ దృష్టిలో "అభ్యర్థించని" లేదా "అవాంఛిత" మెయిల్ అంటే వేరే అర్థం ఉన్నప్పటికీ మీ ఇమెయిల్ స్వీకర్తల దృష్టికోణంలో భిన్నంగా ఉండవచ్చని దయచేసి గుర్తుంచుకోండి. ఇమెయిల్‌ను అనేకమంది స్వీకర్తలకు పంపుతున్నప్పుడు, ఆ స్వీకర్తలు గతంలో మీ నుండి ఇమెయిల్‌లు స్వీకరించేలా ఎంచుకున్నా కూడా పంపే నిర్ణయం తీసుకునే ముందు బాగా ఆలోచించండి. Gmail యూజర్‌లు ఇమెయిల్‌లను స్పామ్ వలె గుర్తు పెట్టినప్పుడు, మా దుర్వినియోగ నిరోధక సిస్టమ్‌లు మీరు భవిష్యత్తులో పంపే మెసేజ్‌లను కూడా స్పామ్‌గా వర్గీకరించే అవకాశం పెరుగుతుంది.

అనేక Gmail ఖాతాలను క్రియేట్ చేయడం, వినియోగం

Google పాలసీలను దుర్వినియోగం చేయడానికి, Gmail ఖాతా పరిమితులను దాటి వ్యవహరించడానికి, ఫిల్టర్‌లు పనిచేయకుండా చేయడానికి, లేదంటే మీ ఖాతాపై విధించిన నియంత్రణలను ఎత్తివేయడానికి బహుళ ఖాతాలను క్రియేట్ చేయవద్దు లేదా వినియోగించవద్దు. (ఉదాహరణకు, మిమ్మల్ని మరొక యూజర్ బ్లాక్ చేసి ఉంటే లేదా దుర్వినియోగం కారణంగా మీ Gmail ఖాతాను డిజేబుల్ చేసి ఉంటే, అదే రకమైన యాక్టివిటీలో పాల్గొనేందుకు మరొక ఖాతాను క్రియేట్ చేయవద్దు.)

అలాగే మీరు ఆటోమేటిక్ మార్గాల్లో Gmail ఖాతాలను క్రియేట్ చేయడానికి లేదా Gmail ఖాతాలను కొనుగోలు చేయడానికి, ఇతరులకు అమ్మడానికి, వర్తకం చేయడానికి లేదా తిరిగి విక్రయించడానికి కూడా అనుమతించబడరు.

మాల్‌వేర్

వైరస్‌లు, మాల్‌వేర్, వార్మ్‌లు, దోషాలు, ట్రోజన్ హార్స్‌లు, పాడైన ఫైల్‌లు లేదా వినాశన, మోసపూరిత స్వభావం గల ఇతరత్రా ఐటెమ్‌లను పంపడానికి Gmailని ఉపయోగించవద్దు. Google లేదా ఇతరత్రా వాటికి చెందిన నెట్‌వర్క్‌లు, సర్వర్‌లు లేదా ఇతర వ్యవస్థల పనితీరుకు హాని కలిగించే లేదా జోక్యం చేసుకునే కంటెంట్‌ను పంపిణీ చేయవద్దు.

మోసాలు, ఫిషింగ్, ఇతర వంచన పద్ధతులు

మీరు మరొక యూజర్ Gmail ఖాతాను వారి నుండి ప్రత్యేక అనుమతి లేకుండా యాక్సెస్ చేయలేకపోవచ్చు.

Gmailని ఫిషింగ్ కోసం ఉపయోగించవద్దు. పాస్‌వర్డ్‌లు, ఆర్థిక వివరాలు, సోషల్ సెక్యూరిటీ నంబర్ మొదలైన వివరాలు గల సున్నితమైన వ్యక్తిగత సమాచారాన్ని అభ్యర్థించడం లేదా సేకరించడం మానుకోండి.

ఇతర యూజర్‌లు వారి సమాచారాన్ని వెల్లడించేలా వారిని తప్పు పేర్లతో మాయ చేయడానికి, తప్పుదారి పట్టించడానికి లేదా మోసగించడానికి మెసేజ్‌లను పంపవద్దు. మోసగించే లేదా తప్పుదారి పట్టించే ఉద్దేశ్యంతో మరొక వ్యక్తి, కంపెనీ లేదా సంస్థలా నటించడం కూడా చేయకూడదు.

పిల్లల భద్రత

పిల్లల లైంగిక అశ్లీల సంబంధిత అంశాల పట్ల Google ఉపేక్షించని పాలసీని కలిగి ఉంది. మాకు ఇలాంటి కంటెంట్ గురించి తెలిస్తే, మేము ఆ సంగతిని చట్టప్రకారం తప్పిపోయిన మరియు పీడింపబడిన పిల్లల జాతీయ కేంద్రానికి రిపోర్ట్ చేస్తాము. మేము ఇటువంటి యాక్టివిటీలలో పాలుపంచుకున్న Gmail ఖాతాలకు వ్యతిరేకంగా క్రమశిక్షణా చర్యను, అవసరమైతే ఖాతా మూసివేత చర్యను కూడా తీసుకోవచ్చు.

చిన్నారులను అనైతిక శృంగారానికి లోబరచుకొనడంతో సహా, వారిపై లైంగిక వేధింపులు, అక్రమ రవాణా లేదా వారిని పాడు చేసే ఉద్దేశ్యంతో వారికి దగ్గరయ్యేందుకు ఉద్దేశించిన ఏవైనా చర్యల కోసం Gmailని ఉపయోగించడాన్ని Google నిషేధిస్తుంది.

చిన్నారి ప్రమాదంలో ఉన్నారని లేదా వేధింపులు, పీడించబడటం లేదా అక్రమ రవాణా చేయబడ్డారని మీరు విశ్వసిస్తే, వెంటనే మీ స్థానిక చట్ట పరిరక్షణ అధికార యంత్రాంగాన్ని సంప్రదించండి.

మీరు చట్ట పరిరక్షణ అధికార యంత్రాంగానికి ఇంతకుముందే రిపోర్ట్ చేసి, ఇంకనూ మీకు సహాయం కావాలంటే లేదా ఒక చిన్నారికి Gmailలో ప్రమాదం పొంచి ఉందని మీకు ఆందోళనగా ఉంటే, మీరు ఈ ఫారమ్‌ను ఉపయోగించి Googleకు ఆ ప్రవర్తనను రిపోర్ట్ చేయవచ్చు. మిమ్మల్ని Gmail ద్వారా సంప్రదించకూడదని మీరు కోరుకునే ఏ వ్యక్తినైనా మీరు ఎప్పుడైనా బ్లాక్ చేయవచ్చని గుర్తుంచుకోండి.

కాపీరైట్

కాపీరైట్ చట్టాలను గౌరవించండి. పేటెంట్, వ్యాపార చిహ్నం, వ్యాపార రహస్యం లేదా ఇతర యాజమాన్య హక్కులతో సహా ఇతరుల మేధో సంపత్తి హక్కులను ఉల్లంఘించవద్దు. అలాగే మీరు మేధో సంపత్తి హక్కులను ఉల్లంఘించమని ఇతరులను ప్రేరేపించడానికి లేదా ప్రోత్సహించడానికి కూడా మీరు అనుమతి పొందరు. మీరు ఈ ఫారమ్‌ను ఉపయోగించడం ద్వారా కాపీరైట్ ఉల్లంఘన గురించి Googleకి రిపోర్ట్ చేయవచ్చు.

పీడించడం

ఇతరులను వేధించడానికి, భయపెట్టడానికి లేదా బెదిరించడానికి Gmailని ఉపయోగించవద్దు. ఎవరైనా ఈ ఉద్దేశాలతో Gmailని ఉపయోగిస్తున్నట్లు గుర్తిస్తే వారి ఖాతాను నిలిపివేయవచ్చు.

చట్టవ్యతిరేక కార్యాచరణ

దీన్ని చట్టబద్ధంగా ఉంచండి. చట్ట వ్యతిరేక కార్యాచరణలను ప్రచారం చేయడానికి, నిర్వహించడానికి లేదా అటువంటి వాటిలో పాలుపంచుకోవడానికి Gmailని ఉపయోగించవద్దు.