Google Sheetsలో డేటాకు అనుగుణంగా నిర్ణయాలు తీసుకోండి
రియల్ టైంలో, ఏ పరికరం నుండి అయినా ఆన్‌లైన్ స్ప్రెడ్‌షీట్‌లను క్రియేట్ చేయండి, పరస్పర సహకారంతో పనిచేయండి.
ఎక్కడి నుండైనా డేటాపై పరస్పర సహకారంతో పనిచేయండి
సులభమైన షేరింగ్, రియల్-టైమ్ ఎడిటింగ్‌తో మీ ఆన్‌లైన్ స్ప్రెడ్‌షీట్‌లో ఖచ్చితమైన వాస్తవాలతో కూడిన డేటాకు స్థానం కల్పించండి. విశ్లేషణను కొనసాగించడానికి కామెంట్‌లను ఉపయోగించండి, పూర్తి చేయాల్సిన చర్యలను కేటాయించండి.
బిల్ట్-ఇన్ ఇంటెలిజెన్స్‌తో గణాంకాలను మరింత వేగంగా పొందండి
స్మార్ట్ ఫిల్, ఫార్ములా సూచనలు వంటి సహాయక ఫీచర్‌లు తక్కువ ఎర్రర్‌లతో వేగంగా విశ్లేషించడంలో మీకు సహాయపడతాయి. అలాగే సాధారణ భాషలో మీ డేటా గురించి ప్రశ్నలు అడగడం ద్వారా త్వరగా గణాంకాలను పొందండి.
ఇతర Google యాప్‌లకు సునాయాసంగా కనెక్ట్ అవ్వండి
Sheetsను మీరు ఇష్టపడే ఇతర Google యాప్‌లకు మీ సమయాన్ని ఆదా చేసే విధంగా ఆలోచనాత్మకంగా కనెక్ట్ చేయడం జరిగింది. Sheetsలో Google Forms డేటాను సులభంగా విశ్లేషించండి లేదా Google Slides, Docsలో Sheets చార్ట్‌లను పొందుపరచండి. మీరు Gmail నుండి నేరుగా కామెంట్‌లకు రిప్లయి ఇవ్వవచ్చు, Google Meetలో మీ స్ప్రెడ్‌షీట్‌లను సులభంగా ప్రెజెంట్ చేయవచ్చు.
Excel ఫైల్స్‌కి సహకారాన్ని, ఇంటెలిజెన్స్‌ను విస్తరించండి
Microsoft Excel స్ప్రెడ్‌షీట్‌లను మార్చకుండా ఆన్‌లైన్‌లో సులభంగా ఎడిట్ చేయండి, Sheetsకి చెందిన మెరుగైన సహకార, సహాయక ఫీచర్‌లు, అంటే, కామెంట్‌లు, పూర్తి చేయాల్సిన చర్యలు, స్మార్ట్ ఫిల్ వంటి వాటితో అదనపు ప్రయోజనాన్ని పొందండి.
అనుకూల పరిష్కారాలను బిల్డ్ చేయండి
బిజినెస్ యాప్‌లు, ఆటోమేషన్‌లను బిల్డ్ చేయడం ద్వారా వర్క్‌ఫ్లోలను వేగవంతం చేయండి. కోడ్ రాయకుండా, Sheets పైన అనుకూల అప్లికేషన్‌లను బిల్డ్ చేయడానికి AppSheetని ఉపయోగించండి. లేదా Apps Scriptతో అనుకూల ఫంక్షన్‌లు, మెనూ ఐటెమ్‌లను, మాక్రోలను జోడించండి.
ఎల్లప్పుడూ తాజా డేటాతో పని చేయండి
Sheetsతో, ప్రతి ఒక్కరూ ఎల్లప్పుడూ స్ప్రెడ్‌షీట్ తాజా వెర్షన్‌పై పని చేస్తున్నారు. అదే విధంగా, వెర్షన్ హిస్టరీలో ఆటోమేటిక్‌గా సేవ్ చేయబడిన ఎడిట్‌లతో, మార్పులను రద్దు చేయడం లేదా ప్రతి ఒక్క స్ప్రెడ్‌షీట్ సెల్ ఎడిట్ హిస్టరీనీ చూడటం కూడా సులభం.
క్రిటికల్ డేటాకు సునాయాసంగా కనెక్ట్ అవ్వండి
Salesforce నుండి కస్టమర్ డేటా వంటి మీరు ఉపయోగించే ఇతర టూల్స్ నుండి, డేటాను సమీకరించి విశ్లేషించండి. Enterprise కస్టమర్‌లు, Sheetsలో బిలియన్ల కొద్దీ అడ్డు వరుసల BigQuery డేటాను విశ్లేషించడానికి కనెక్ట్ చేయబడిన Sheetsను కూడా ఉపయోగించవచ్చు – ఎలాంటి కోడ్ రాయకుండా.
సెక్యూరిటీ, నియమపాలన, గోప్యత
ఆటోమేటిక్‌గా సురక్షితమైనది
మేము మీ డేటాను సురక్షితంగా ఉంచడానికి అధునాతన మాల్వేర్ రక్షణలతో సహా, భద్రతా రంగంలోని అత్యంత అధునాతనమైన సెక్యూరిటీ ప్రమాణాలను ఉపయోగిస్తాము. అలాగే Sheets అనేది స్థానిక-క్లౌడ్ సర్వీస్, ఇది లోకల్ ఫైళ్ల అవసరాన్ని తొలగిస్తుంది, అలాగే మీ పరికరాలకు ప్రమాదాన్ని తగ్గిస్తుంది.
బదిలీ చేయబడుతున్నప్పుడు, స్టోర్ అయ్యి ఉన్నప్పుడు ఎన్‌క్రిప్షన్ ఉంటుంది
Google Driveకి అప్‌లోడ్ చేయబడిన లేదా Sheetsలో క్రియేట్ చేయబడిన అన్ని ఫైల్‌లు బదిలీ చేయబడుతున్నప్పుడు, స్టోర్ అయ్యి ఉన్నప్పుడు ఎన్‌క్రిప్ట్ చేయబడతాయి.
రెగ్యులేటరీ ఆవశ్యకతలను సపోర్ట్ చేసే విధంగా నియమపాలనను కలిగి ఉంటుంది
Sheetsతో సహా మా ప్రోడక్ట్‌లన్నిటికీ క్రమం తప్పకుండా వాటి సెక్యూరిటీ, గోప్యత, అనుకూలత కంట్రోల్స్ విషయంలో స్వతంత్ర వెరిఫికేషన్ జరుగుతుంది.
గోప్యతను కాపాడేలా డిజైన్ చేయబడింది
మిగిలిన Google Cloud ఎంటర్‌ప్రైజ్ సర్వీస్‌ల మాదిరిగానే Sheets కూడా అదే స్థాయి ఖచ్చితమైన గోప్యతా వాగ్దానాలు, డేటా రక్షణలను అవలంబిస్తుంది.
మీ డేటాను మీరే కంట్రోల్ చేస్తారు.
మీ Sheets కంటెంట్‌ని యాడ్ ప్రయోజనాల కోసం మేము ఎప్పుడూ ఉపయోగించము.
మేము మీ వ్యక్తిగత సమాచారాన్ని ఎప్పటికీ థర్డ్-పార్టీకి విక్రయించము.
మీకు సరిపోయే ప్లాన్‌ను ఎంచుకోండి
Google Sheets అనేది Google Workspaceలో భాగం
ప్రతి ప్లాన్‌లో ఇవి ఉంటాయి
వ్యక్తిగత అవసరాల కోసం (ఉచితం) |
Business Standard$12 USD
ప్రతి యూజర్‌కు / నెలకు, 1 సంవత్సరం నిబద్ధత లేదా నెలవారీ బిల్ చేసినప్పుడు, ప్రతి యూజర్‌కు / నెలకు $14.40
|
|
---|---|---|
Docs, Sheets, Slides, Forms
కంటెంట్ క్రియేషన్ |
||
Drive
సురక్షితమైన క్లౌడ్ స్టోరేజ్ |
ఒక్కో యూజర్‌కు 15 GB |
ఒక్కో యూజర్‌కు 2 TB |
మీ టీమ్ కోసం షేర్ చేసిన డ్రైవ్‌లు |
||
Gmail
సురక్షితమైన ఈమెయిల్ |
||
అనుకూల బిజినెస్ ఈమెయిల్ |
||
Meet
వీడియో, అలాగే వాయిస్‌తో కూడిన ఆన్‌లైన్ మీటింగ్ |
పాల్గొనేవారు 100 మంది |
పాల్గొనేవారు 150 మంది |
మీటింగ్ రికార్డింగ్‌లు Driveలో సేవ్ అయ్యాయి |
||
అడ్మిన్
కేంద్రీకృత అడ్మినిస్ట్రేషన్ |
||
గ్రూప్-ఆధారిత సెక్యూరిటీ పాలసీ కంట్రోల్స్ |
||
కస్టమర్ సపోర్ట్ విభాగం |
ఆన్‌లైన్‌లో సెల్ఫ్ సర్వీస్, కమ్యూనిటీ ఫోరమ్‌లు |
24/7 ఆన్‌లైన్ సపోర్ట్, కమ్యూనిటీ ఫోరమ్‌లు |
ఎక్కడి నుండైనా, ఏ పరికరంలోనైనా కలిసి పని చేయండి
మీరు ఎక్కడ ఉన్నా — ఏదైనా మొబైల్ పరికరం, టాబ్లెట్ లేదా కంప్యూటర్ నుండి — ఆఫ్‌లైన్‌లో ఉన్నప్పుడు కూడా మీ స్ప్రెడ్‌షీట్‌లను యాక్సెస్ చేయండి, క్రియేట్ చేయండి, ఎడిట్ చేయండి.
టెంప్లేట్లతో ప్రారంభించండి
పనులను త్వరితంగా మొదలుపెట్టేందుకు వివిధ రకాల డ్యాష్‌బోర్డ్‌లు, ప్రాజెక్ట్ ట్రాకర్, వృత్తిపరంగా రూపొందించిన ఇతర టెంప్లేట్ల నుండి ఎంచుకోండి.
మరింత సమాచారం కోసం Sheets టెంప్లేట్ గ్యాలరీని సందర్శించండి.